యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. విశాల్ నెక్స్ట్ మూవీ అప్డేట్..
29 November 2023
రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా యానిమల్. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్.
డిసెంబర్ 1, 2023న విడుదల కానుంది ఈ చిత్రం. దీనికి అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే నవంబర్ 27న ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా జరిగింది.
హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీలో యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి హాజరయ్యారు.
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్స్ తర్వాత సుందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచానలు ఉన్నాయి.
దీని తర్వాత పాన్ స్టార్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు దర్శకుడు సుందీప్.
ఈ మధ్యే మార్క్ ఆంటోనీ సినిమాతో 100 కోట్ల విజయాన్ని అందుకున్నారు విశాల్. ఈ ఊపులో వరస సినిమాలకు కమిట్ అవుతున్నారు ఈ యాక్షన్ హీరో.
తాజాగా ఈయన తర్వాతి సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. విశాల్ కెరీర్‌లో 34వ సినిమా ఇది. మాస్ డైరెక్టర్ హరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్లస్ టీజర్‌ను డిసెంబర్ 1న విడుదల చేయబోతున్నారు. విశాల్ 34 వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి