యానిమల్ ఓపెనింగ్స్ అదుర్స్..  జైలర్ మరో ఘనత..

02 December 2023

రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా యానిమల్.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్. తాజాగా డిసెంబర్ 1న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

యానిమల్ సినిమాకి అన్నిచోట్లా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. తెలుగులో కూడా ఈ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి.

తెలుగులోనూ డబ్బింగ్ సినిమాలా కాకుండా.. స్ట్రెయిట్ మూవీలాగే భారీగా విడుదలైంది యానిమల్. ప్రొమోషన్స్ కూడా తెలుగులో భారీగా చేసారు.

రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ జైలర్. ఈ చిత్రం తమిళనాట రికార్డులు తిరగరాసింది.

కేవలం సినిమా మాత్రమే కాదు.. ఆడియోకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హుకుం పాట అయితే దుమ్ము దులిపేస్తుంది.

ఈ పాటకు యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇదే విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేసారు దర్శక నిర్మాతలు.

ఈ సినిమాలో రమ్య కృష్ణ, మిర్న మీనన్, మలయాళీ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ వంటి వారు కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు.