బాలయ్య మూవీలో యంగ్ హీరోయిన్.. డంకీ అర్ధం తెలిపిన బాద్‌షా..

09 December 2023

భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ తర్వాత తక్కువ గ్యాప్‌లోనే మరో సినిమాని మొదలుపెట్టసారు నందమూరి నటసింహ బాలకృష్ణ.

వాల్తేర్ వీరయ్య హిట్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రలో హీరోయిన్ చాందిని చౌదరి నటిస్తుంది.

తాజాగా ఈ సినిమా సెట్‌లో దర్శకుడు బాబీతో కలిసి చాందిని చౌదరి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ ఫోటోలను చాందిని తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. ఇది చుసిన నెటిజన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు.

షారుఖ్ ఖాన్, తాప్సి జంటగా పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న చిత్రం డంకి ఈ నెల 21న విడుదల కానుంది. దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి.

ఈ సినిమా ఎనౌన్స్‌ అయినప్పటినుంచి డంకి పదానికి అర్ధం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు సినీ ప్రేమికులు.

తాజాగా ఈ విషయంపై డంకి అంటే అర్ధం ఏంటో తెలుపుతూ క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్ కింగ్ ఖాన్ హీరో షారుక్ ఖాన్.

దేశ సరిహద్దుల్లో అక్రమంగా చేసే ప్రయాణాన్ని డాంకీ జర్నీ అంటారు. అదే పదాన్ని పంజాబీ యాసలో డంకీ అంటారని క్లారిటీ ఇచ్చారు బాద్‌షా.