పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్.
ఈ సినిమాలో ఈశ్వరి రావు, శ్రియ రెడ్డి, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, గురుడ రామ్, వంటివారు ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.
డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే 700 కోట్లకు పైగా వసూలు చేసింది. సంక్రాంతికి కూడా సలార్ మంచి వసూళ్లనే తీసుకొస్తుంది.
ఇదిలా ఉంటే ఈ చిత్ర డిజిటల్ ప్రీమియర్‌కు టైమ్ ఫిక్స్ చేసారు దర్శక నిర్మాతలు. ఫిబ్రవరి 4 నుంచి ప్రముఖ ఓటిటిలో సలార్ స్ట్రీమ్ కానున్నట్లు తెలుస్తుంది.
తేజా సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన తెలుగు సూపర్ హీరో హనుమాన్ సినిమా కలెక్షన్ల మోత మోగిస్తుంది.
తెలుగుతో పాటు హిందీలోనూ దీనికి మంచి వసూళ్లే వస్తున్నాయి. హిందీలో 5 రోజుల్లోనే 18.77 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది
ఓవర్సీస్‌లో 4 రోజుల్లోనే 3.4 మిలియన్ వసూలు చేసి.. 4 మిలియన్ వైపు అడుగులు వేస్తుంది. ఇదే జరిగితే నాన్ ప్రభాస్, నాన్ రాజమౌళి రికార్డులన్నింటినీ హనుమాన్ తుడిచి పెట్టడం ఖాయం.
ఇప్పటి వరకు 114 కోట్ల గ్రాస్ వసూలు చేసింది హనుమాన్. కథానాయకిగా అమృత అయ్యర్ ఆకట్టుకుంది. వరలక్ష్మి శరత్ కుమార్ తేజకి అక్కగా నటించి మెప్పించింది.