బన్నీ బావమరిది హీరోగా పరిచయం.. డెవిల్ నుంచి అప్‌డేట్..
26 December 2023
TV9 Telugu
నందు, అవికా గోర్ జంటగా లక్కీ మీడియా నిర్మాణంలో ప్రణవ స్వరూప్ తెరకెక్కిస్తున్న తాజా సినిమా అగ్లీ స్టోరీ.
ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ సినిమా వస్తుంది.
2024లో మేం హిట్ కొట్టబోతున్నామంటూ నమ్మకంగా చెప్తున్నారు మేకర్స్. ఈ మధ్యే వధువు వెబ్ సిరీస్‌లో కలిసి నటించారు నందు, అవికా గోర్.
అల్లు అర్జున్ బావమరిది విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయమవుతున్న సినిమా ముఖ్య గమనిక. లావణ్య హీరోయిన్‌గా నటిస్తున్నారు.
గతంలో కొన్ని హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన వేణు మురళిధర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ఆ కన్నుల చూపుల్లోన అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు బాబీ విడుదల చేసారు.
బింబిసార లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కలిసి నటిస్తున్న సినిమా డెవిల్. అభిషేక్ నామా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఆయనే నిర్మాత కూడా.
డిసెంబర్ 29న విడుదల కానుంది డెవిల్. తాజాగా ఈ చిత్ర మేకింగ్ వీడియోను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. 1940ల నేపథ్యంలో డెవిల్ కథ సాగుతుంది.