అలా పిలిస్తే తిట్టినట్టు ఉందన్న నయన్.. చిరుతో మూవీ చేయాలని ఉందన్న సందీప్..

11 December 2023

లేడీ సూపర్‌ స్టార్ అన్న ట్యాగ్ విషయంలో తాజాగా ఆసక్తికరంగా స్పందించారు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార.

ఎవరైన తనను అలా పిలిస్తే తిట్టినట్టుగా అనిపిస్తుంది అన్నారు. జవాన్ సినిమా తరువాత ఎక్కువ మంది లేడీ సూపర్‌ స్టార్ అంటున్నారని తెలిపారు.

వాళ్లు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు అన్నారు. తనకు ఇంత గౌరవం దక్కడానికి కారణం సినీ రంగమే అన్నారు నయన్‌.

రణబీర్ కపూర్ హీరోగా రానున్న బ్రహ్మాస్త్ర పార్ట్ 2కు సంబంధించిన తాజా అప్‌డేట్ బాలీవుడ్‌లో వైరల్ అవుతోంది.

తొలి భాగంలో రివీల్ చేయకుండా ఉంచిన దేవ్‌ క్యారెక్టర్‌లో నటించబోయే ఆర్టిస్ట్ ఎవరన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది.

ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే రణవీర్‌ సింగ్ ఈ పాత్రలో నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

మెగాస్టార్‌ చిరంజీవితో ఓ మంచి యాక్షన్‌ మూవీ చేయాలని ఉందని అన్నారు స్టార్ డైరక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా.

ఫారిన్‌ ట్రిప్‌లో ఉన్న ఆయన అక్కడి ఫ్యాన్స్ తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. సందీప్‌ డైరక్షన్‌లో విడుదలైన యానిమల్‌ సినిమా 600 కోట్లకు పైగా వసూలు చేసింది.