కౌంట్‌డౌన్ మొదలైందంటున్న రష్మిక.. వరుణ్‌తేజ్ కొత్త మూవీ షురూ..
29 November 2023
యానిమల్ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఫొటో షూట్ చేశారు నేషనల్ క్రాష్, టాలీవుడ్ శ్రీవల్లి రష్మిక మందన్న.
రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్‌రెడ్డి వంగా డైరక్ట్ చేసిన సినిమా యానిమల్. ఈ సినిమాకు కౌంట్‌డౌన్ మొదలైందని అన్నారు రష్మిక.
డిసెంబర్ 1న విడుదల కానుంది యానిమల్ సినిమా. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. దీనికి స్టార్ డైరెక్టర్ రాజమౌళి, మహేష్ బాబు చీఫ్ గెస్ట్స్ గా వచ్చారు.
వరుణ్‌తేజ్ హీరోగా, పలాస ఫేమ్ కరుణకుమార్ డైరక్ట్ చేస్తున్న సినిమా మట్కా. ఈ చిత్రాన్ని అయన పెళ్లికి ముందు ప్రకటించారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ని డిసెంబర్ నుంచి మొదలుపెట్టనున్నారు. ప్రీ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ జరుగుతున్నాయి.
1958-1982 మధ్య జరిగే కథతో విశాఖపట్నం బ్యాక్ డ్రాప్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని గతంలోనే చెప్పారు.
ప్రస్తుతం ఆపరేషన్ వాలంటైన్ చిత్రంలో నటిస్తున్నారు వరుణ్‌తేజ్. ఈ మూవీ త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి