నా సామిరంగ షూటింగ్ పూర్తి.. కెప్టెన్‌ మిల్లర్‌ థ్రిల్లింగ్ ట్రైలర్‌.. 

TV9 Telugu

08 January 2024

కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న నా సామిరంగ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఆషిక రంగనాథ్ హీరోయిన్.

రిలీజ్‌కు వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ కూడా వేగంగా పూర్తి చేస్తోంది చిత్రయూనిట్‌.

విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్న నా సామిరంగ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రంలో అల్లరి నరేష్, యంగ్ హీరో రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మిర్న మీనన్ కూడా ఓ పాత్రలో నటించింది.

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా తెరకెక్కిన తొలి పాన్ ఇండియా యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కెప్టెన్‌ మిల్లర్‌.

అరుణ్ మాతేశ్వరన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్‌ అయ్యింది.

ప్రియాంక అరుళ్ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇదిలా ఉంటె ఈ చిత్రం తెలుగు వెర్షన్ మాత్రం పండక్కి విడుదల కాదని గతంలో తెలిపారు మేకర్స్. ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు.