త్వరలో తండేల్ షూటింగ్ మొదలు.. ‘నమో’ ఫస్ట్‌లుక్‌ విడుదల..

12 December 2023

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం తండేల్. ఈ మధ్యే ఓపెనింగ్ కూడా జరిగింది.

రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం కోసం ఊహించని బడ్జెట్ పెడుతున్నారు దర్శక నిర్మాతలు.

ప్రస్తుతానికి బడ్జెట్ అనేది లెక్కలు వేసుకోకుండా కథకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం 70 కోట్ల అంచనాతో సినిమా ప్లాన్ చేస్తున్నారు.

బాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గన్, అక్షయ్ కుమార్‌లకు అలహాబాద్ కోర్ట్ నుంచి నోటీసులు అందాయి.

కొన్నేళ్లుగా టొబాకో యాడ్స్‌ను ప్రమోట్ చేస్తున్నారని.. దానివల్ల సమాజానికి ఎంతో నష్టం జరుగుతుందని.. కోర్టులో కేసు నమోదైంది.

అంత పెద్ద స్థాయిలో ఉన్న హీరోలు ఇలా అనారోగ్యానికి కారణమయ్యే యాడ్స్ చేయడం తప్పు అంటూ కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి.

విశ్వంత్‌, అనురూప్‌, విస్మయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నమో’. ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దీని ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని.. వినోద ప్రధానంగా యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని చెప్పారు దర్శక నిర్మాతలు.