త్రిషకు సపోర్ట్ గా నితిన్‌.. బాలీవుడ్‌ కు ప్రియాంక టాటా..

21 November 2023

హీరోయిన్ త్రిష కృష్ణన్ గురించి మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌.

ఆ అమ్మాయి గురించి అంత వల్గర్‌ స్టేట్‌మెంట్‌ ఎలా ఇచ్చారని మన్సూర్‌ అలీఖాన్‌ ఉద్దేశిస్తూ అన్నారు హీరో నితిన్.

చావనిజానికి మన సమాజంలో స్థానం లేదని, ఇండస్ట్రీలోని మహిళలకు అవమానం జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ గొంతు విప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఇకపై ఎలాంటి సినిమాలు చేయకూడదని ఫిక్సయ్యారట బాలీవుడ్ స్టార్ కథానాయక ప్రియాంక చోప్రా.

అందుకే ముంబైలోని ఉన్న తన ప్రాపర్టీస్‌ అన్నింటిని ప్రియాంక విక్రయించేస్తున్నారన్నది బాలీవుడ్ లో టాక్‌.

ప్రియాంక చోప్రా పూర్తిగా హాలీవుడ్‌కి షిఫ్ట్ అవుతారనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జోరుగా జరుగుతోంది.

సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం టైగర్‌3. పబ్లిక్‌ నుంచి యునానిమస్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకోకపోయినా కలెక్షన్లు మాత్రం 200 కోట్లు దాటాయి.

ఈ సందర్భంగా టైగర్‌4 చేస్తానని ప్రకటించారు సల్మాన్ ఖాన్‌. ఆల్రెడీ టైగర్‌ కాన్సెప్ట్ తో చేసిన మూడు సినిమాలు క్లిక్‌ అయినందుకు ఆనందంగా ఉందని అన్నారు.