ఘనంగా దగ్గుబాటి హీరో పెళ్లి.. యానిమల్ సీక్వెల్ అప్డేట్..
09 December 2023
అహింస సినిమాతో హీరోగా పరిచయం అయిన సురేష్ బాబు తనయుడు, రానా దగ్గుబాటి తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ఓ ఇంటివాడయ్యాడు.
తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీ దగ్గరి బంధువుల అమ్మాయి ప్రత్యూషతో అభిరామ్ దగ్గుబాటి వివాహం ఘనంగా జరిగింది.
శ్రీలంక దేశంలోని ఓ రిసార్ట్‌లో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
త్వరలో హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు దగ్గుబాటి కుటుంబం. దీనికి సెలెబ్రెటీలు అంత హాజరుకానున్నారు.
తాజాగా యానిమల్ సినిమా సీక్వెల్‌కు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు ఆ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.
ఈ సినిమా సీక్వెల్‌లో మరిన్ని బలమైన పాత్రలు, ఊహించనన్ని యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని అన్నారు సందీప్.
ముఖ్యంగా ఈ మూవీ పార్ట్ 2లో రణబీర్ కపూర్ పాత్ర మరింత రాక్షసంగా ఉంటుందని తెలిపారు దీన్ని తెరకెక్కించనున్న దర్శకుడు.
డిసెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన యానిమల్ బ్లాక్ బాస్టర్ అయింది. భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి