గుంటూరు కారం క్రేజీ అప్‌డేట్.. మరో కేజీఎఫ్ 3 గురించి ప్రశాంత్..

08 December 2023

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న గుంటూరు కారం అప్‌డేట్స్ గురించి అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

ముఖ్యంగా ఫస్ట్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సెకండ్ సింగిల్ కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్.

తాజాగా దీని అప్‌డేట్ ఇచ్చారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. డిసెంబర్ 11 గుంటూరు కారం రెండో పాట విడుదల కానుంది.

ఇది రొమాంటిక్ సింగిల్ అని కన్ఫర్మ్ చేసారు మేకర్స్. సంక్రాంతి కనుకగా జనవరి 13న విడుదల కానుంది ఈ చిత్రం.

కేజీఎఫ్ సిరీస్ నుంచి కేజీఎఫ్ 3 సినిమా తప్పకుండా వస్తుందని మరోసారి ఖరారు చేసారు దర్శకుడు ప్రశాంత్ నీల్.

ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని.. కానీ ఆ సినిమాను తాను తెరకెక్కిస్తానో లేదో అంటూ ట్విస్ట్ ఇచ్చారు ప్రశాంత్ నీల్.

కెజిఎఫ్ మొదటి రెండు భాగాల్లో హీరోగా నటించిన యష్ మాత్రం అందులో ఉంటారనే విషయం కన్ఫర్మ్ చేసారు ప్రశాంత్ నీల్.

నిజానికి కెజిఎఫ్ 2 అయిపోయినపుడే పార్ట్ 3 స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసామని.. అయితే అది రావడానికి ఇంకా చాలా టైమ్ ఉందని చెప్పారు ప్రశాంత్ నీల్.