మెగా అభిమానులకు దిల్ రాజు షాక్.. రెండో స్థానంలో సలార్..
26 December 2023
TV9 Telugu
మెగా అభిమానులకు షాక్ ఇచ్చారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. రామ్ చరణ్ సినిమా షూటింగ్ గురించి ఆసక్తికర విషయం.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో రిలీజ్ అవుతుందని చెప్పారు.
ఇప్పటికే రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్‌కు జోడిగా కియారా అద్వానీ నటిస్తున్నారు.
ఈ చిత్రం చిత్రీకరణ చాలాసార్లు బ్రేక్ పడడంతో దినిపై చాల అనుమానలు వ్యక్తం అవుతున్నాన్నాయి. దిల్ రాజు ప్రకటనతో వీటికి ఫుల్ స్టాప్ పడింది.
ప్రభాస్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తొలి రోజు రికార్డ్ వసూళ్లు సాధించి బ్లక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
డే వన్ 178.7 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ ప్రభాస్ కెరీర్‌లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్ట్‌లో రెండో స్థానంలో నిలిచింది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు.
డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమాలో ఈశ్వరి రావు, శ్రియా రెడ్డి, గరుడ రామ్, ఝాన్సీతో పాటు మరికొందరు తమ నటనతో ఆకట్టుకున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి