అమితాబ్‌కు ఆ పురస్కారం..
TV9 Telugu
18 April 2024
బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ గురించి తెలియనివారుండరు. హిందీతో తెలుగు కూడా ఎన్నో సినిమాల్లో నటించారు.
1969లో మృణాల్ సేన్ జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రం భువన్ షోమ్‌లో వాయిస్ వ్యాఖ్యాతగా తన సినీ రంగ ప్రవేశం చేశారు.
1971లో ఆనంద్ మూవీలో బచ్చన్ రాజేష్ ఖన్నాతో కలిసి వైద్యునిగా నటించి ఉత్తమ సహాయ నటుడిగా మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును పొందారు.
బాలీవుడ్ సినిమాల్లో స్టార్ హీరోగా ఎన్నో సినిమాలు చేసారు ఆయన. వాటికి తెలుగులో కూడా మంచి స్పందన వచ్చింది.
ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ కల్కి 2898 ఏడిలో అశ్వద్దామా పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఓ పురస్కారానికి ఎంపికయ్యారు.
ఈ ఏడాది లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని అమితాబ్ బచ్చన్‌కు ఇవ్వనున్నట్టు ప్రకటించారు నిర్వాహకులు.
ప్రముఖ భారతీయ చలనచిత్ర గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారం.
గాయని లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఆమె కుటుంబసభ్యులు 2022లో ఆమె మరణం తర్వాత ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి