లాల్ సలామ్ ఆడియో రైట్స్.. ప్రమోషన్స్ లో హాయ్ నాన్న..
12 November 2023
రజినీకాంత్ గెస్ట్ రోల్ చేస్తున్న సినిమా లాల్ సలామ్. సౌందర్య రజినీకాంత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్ర ఆడియో రైట్స్ పూర్తైనట్లు తెలిపారు మేకర్స్. సోనీ మ్యూజిక్ ఈ చిత్ర ఆడియో రైట్స్ తీసుకున్నారు.
టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సినిమా ఊరి పేరు భైరవకోన.
వర్ష బొల్లమ్మ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని హమ్మ హమ్మ సాంగ్ మేకింగ్ వీడియో విడుదల చేసారు మేకర్స్.
కాజల్ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా సత్యభామ ప్రమోషన్స్ కోసం రానా వచ్చారు. ఈయనతో స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు మేకర్స్.
నాని హీరోగా శౌర్యు తెరకెక్కిస్తున్న సినిమా హాయ్ నాన్న. డిసెంబర్ 7న విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ మొదలు పెట్టారు నాని.
ఇప్పటికే నేషనల్ మీడియాతో మాట్లాడిన ఈయన.. తెలుగులోనూ బిజీ అవుతున్నారు. యూ ట్యూబ్ ఛానెల్స్‌కు వరస ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు.
మహేష్ బాబు గుంటూరు కారం నుంచి దివాళి అప్‌డేట్ ఉంటుందని థమన్ ట్వీట్ చేసారు. మిర్చి ఎమోజిని జోడిస్తూ ఈ పోస్ట్ చేసారు థమన్.