లాల్ సలాం డేట్ ఫిక్స్.. మారితో రజనీకాంత్..
TV9 Telugu
12 January 2024
సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న లాల్ సలాం సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేశారు మూవీ మేకర్స్.
ఈ సినిమాను వచ్చే నెల (ఫిబ్రవరి 9)న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు దర్శక నిర్మాతలు.
ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
ఈ చిత్రంలో తలైవా రజనీకాంత్ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారు. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు పెరిగాయి.
లాల్ సలాం క్రికెట్ నేపథ్యంలో సాగే సినిమా. దీనికే టెర్రరిజం నేపథ్యాన్ని కూడా జోడించారు మూవీ మేకర్స్.
జైలర్ తర్వాత ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా ఉన్న కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరో మూవీని ఓకే చేశారు.
కర్ణన్, మామన్నన్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు రజనీకాంత్.
ప్రస్తుతం వేట్టయన్ సినిమాలో నటిస్తున్న రజనీ, నెక్ట్స్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి