TV9 Telugu
29 January 2024
అందుకే నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదు..: సాయి పల్లవి.
టాలీవుడ్ లో నేచురల్ బ్యూటీ అంటే టక్కున చెప్పే పేరు సాయి పల్లవి.
చాలా మంది కుర్రాళ్ళు ఇలాంటి లవర్ ఉండాలి అని అనుకునే క్వాలిటీస్ అన్ని ఈ అమ్మడిలో ఉంటాయి.
రీసెంట్ గా సాయి పల్లవి సిస్టర్ పూజ పెళ్లి జరగనుంది. ఇటీవలే ఎంగేజ్మెంట్ జరిగింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి పల్లవి ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందని అభిమానుల మధ్య చర్చ మొదలైంది.
అయితే తన పెళ్లి గురించి గతంలో సాయి పల్లవి మాట్లాడింది. ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
సాయి పల్లవి మాట్లాడుతూ నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడే 23 సంవత్సరాలకి వివాహం చేసుకోవాలని అనుకున్నా..
అలాగే 30 ఏళ్ల లోపు పిల్లలను కూడా కన్నేయాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
నాపై కొన్ని బాధ్యతలు పడ్డాయి. దాంతో పెళ్లి వాయిదా వేశా.. సినిమాల్లో మంచి పేరు రావడంతో ఇప్పట్లో పెళ్లి లేనట్టే అని తెలిపింది సాయి పల్లవి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి