లేడీ సూపర్ స్టార్ నయనతార ఫిట్‌నెస్ సీక్రెట్.?

TV9 Telugu

30 January 2024

విష్ణువిశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా రజినీకాంత్ కూతురు ఐశ్వర్య తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా సినిమా లాల్ సలామ్.

టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం ఓ కీలక పాత్ర చేస్తున్నారు.

ఫిబ్రవరి 9 విడుదల కానున్న ఈ సినిమా ఆడియో వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. దీనికి చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు.

ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. తంబి రామయ్య, జీవిత, ధన్య బాలకృష్ణ వంటి తిదితరులు దీనిలో నటిస్తున్నారు.

హిందీలో ఎన్ని సినిమాలు చేస్తున్న అక్కడున్న పోటీని తట్టుకుని స్టార్ కాలేకపోతున్నారు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.

అందుకే తల్లి మాదిరే దక్షిణాది సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు ఈమె. ఇక్కడే వరస సినిమాలు సైన్ చేస్తున్నారు.

ఇప్పటికే దేవరలో హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ.. తాజాగా సూర్యతో నటించడానికి రెడీ అవుతున్నారు జాన్వీ.

త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు బయటికి రానున్నాయి. సౌత్ లో ఈ బ్యూటీకి మరిన్ని అవకాశాలు రానున్నాయి.