TV9 Telugu
పిల్లలు ససేమిరా వద్దన్నారు! ఖుష్బూ..
02 March 2024
రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన చిత్రం యానిమల్. రష్మిక మందన్న ఈ సినిమాలో కథానాయక.
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ యానిమల్ సినిమా విషయంలో రెండు రకాల అభిప్రాయాలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఆ సినిమాను సపోర్ట్ చేస్తున్నవారిది ఓ వర్గం అయితే, ఆ సినిమాను అసలు ఎలా తీశారు? ఎందుకు కలెక్షన్లు వస్తున్నాయని తిట్టేవారిది ఇంకో వర్గం.
ఈ సెకండ్ యూనిట్‌లోనే జాయిన్ అయ్యారు సీనియర్ నటి ఖుష్బూ సుందర్. తాను ఇప్పటికీ సినిమా చూడలేదని అన్నారు.
తన పిల్లలిద్దరూ సినిమా చూశారని చెప్పారు. పొరపాటున కూడా యానిమల్‌కి వెళ్లొద్దని అన్నారని తెలిపారు ఆమె.
పిల్లలు కూడా చూడొద్దని చెబుతున్న ఆ సినిమాకు అన్ని వందల కోట్ల కలెక్షన్లు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదని అన్నారు.
దర్శకుడిని తాను ఏమీ అనడం లేదన్నారు. అలాంటి సినిమాలను ప్రోత్సహిస్తున్న యువకుల బుర్రల్లో అసలేం ఉందని ప్రశ్నించారు.
ఎలాంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తున్నామనే విషయాన్ని ప్రేక్షకులంతా గమనించాలని కోరారు నటి కుష్బూ సుందర్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి