30 December 2023

దిమ్మతిరిగేలా చేస్తున్న గుంటూరోడి.. కుర్చీ మడత పెట్టి...

TV9 Telugu

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న సినిమా గుంటూరు కారం.

ఇందులో మహేష్ ఫుల్ మాస్ అవతారంలో కనిపించనుండడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

ఇక చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు జనవరి 12న గ్రాండ్‏గా విడుదల కాబోతుంది.

ఈ క్రమంలో తాజాగా 'కుర్చీ మడతపెట్టి' అనే సాంగ్‌ ప్రోమో రిలీజ్‌ అయింది. అందరికీ తెలియని కిక్కిస్తోంది.

ఎస్! తాజాగా విడుదలైన ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ప్రోమో అదిరిపోయింది.

ఇందులో మహేష్, శ్రీలీల మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్‏కు తమన్ మ్యూజిక్ అందించాడు. 

ప్రస్తుతం రిలీజ్ అయిన సాంగ్ ప్రోమో వైరలవుతుండగా.. ఈపాటకు థియేటర్లలో వింటే రచ్చే అంటున్నారు ఫ్యాన్స్.