నా భర్తకు ఉండాల్సిన లక్షణాలు ఇవే.. హీరోయిన్ కృతి సనన్..
Rajitha Chanti
Pic credit - Instagram
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది టాప్ హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ముందుగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది కృతి సనన్.
మిమి సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది ఈ బ్యూటీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన లైఫ్, ఫిల్మ్ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఈ క్రమంలోనే తనకు కాబోయే భర్త గురించి.. తన కలల ఆలోచనల గురించి కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది. తన భర్తకు కొన్ని లక్షణాలు ఉండాలని చెప్పేసింది కృతి.
నిజాయితీ, విధేయత.. ఎక్కువ ప్రేమగల వ్యక్తి మాత్రమే తనకు భర్తగా రావాలని కోరుకుంటున్నానని తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరలవుతుంది.
ప్రస్తుతం ది క్రూ సినిమాలో నటిస్తుంది. ఇందులో కరీనా కపూర్, టబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కృతి సనన్ క్యాబిన్ క్రూగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని మార్చి 29న రిలీజ్ చేయనున్నారు. ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఒకేచోట పనిచేసే ముగ్గురి మహిళల జీవితాన్ని విధి ఎలా మలుపులు తిప్పిందనేది స్టోరీ.
1990 జూలై 27న ఢిల్లీలో జన్మించింది. మోడల్ గా ఎన్నో కమర్షియల్ యాడ్స్ చేసిన కృతి.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారింది.