17 గంటలు నాన్‌స్టాప్‌గా చేశాను! కృతి..
TV9 Telugu
19 March 2024
అసలు ఎలా సాధ్యం? రోజులో 16-17 గంటలు నాన్‌స్టాప్‌గా పనిచేయడం సుకుమారంగా కనిపించే హీరోయిన్లకు సాధ్యమేనా?
ఎందుకు కాదూ... నేను చేశానుగా అని సమాధానం ఇస్తున్నారు స్టార్ హీరోయిన్ సిల్వర్ స్క్రీన్ మిమి కృతిసనన్.
ఇటీవల ఈ బాలీవుడ్ క్రేజీ బ్యూటీ తన సొంతంగా ఓ సినిమా ప్రొడక్షన్ హౌస్ పెట్టారు. దీంతో నిర్మాతగా మారారు.
ఈ బాలీవుడ్ న్యూ ప్రొడక్షన్ హౌస్ కి బ్లూ బటర్‌ఫ్లై ఫిలిమ్స్ అని పేరు పెట్టారు స్టార్ కథానాయక కృతి సనన్.
ఈ నిర్మాణ సంస్థలో ఈ బ్యూటీ నిర్మాతగా దో పత్తీ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నటిస్తున్నారు కూడా.
ఈ సినిమా కోసం లాజిస్టిక్స్ అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు కృతి. స్క్రిప్ట్, కేరక్టర్స్, మ్యూజిక్.. ఒకటేంటి? 24 క్రాఫ్ట్స్ లోనూ ఇన్వాల్వ్ అయ్యారట.
అందుకే ఈ సినిమా కోసం రోజుకు 16-17 గంటలు పనిచేయాల్సి వచ్చిందని అంటున్నారు టాలీవుడ్ జానకి కృతి సనాన్.
నియర్ ఫ్యూచర్‌లో నటిగానే కాదు, నిర్మాతగా కూడా సక్సెస్ అవుతానని చెబుతున్నారు ఆదిపురుష్ హీరోయిన్ జానకి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి