కృతి సనన్  సంపాదన తెలిస్తే బుర్ర ఫ్రీజ్‌ కావాల్సిందే

TV9 Telugu

08 March 2024

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న టాప్ హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'వన్ నేనొక్కడినే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఈబ్యూటీ. అయితే వన్ నేనొక్కడినే మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో కృతి బాలీవుడ్‌కే పరిమితం అయింది.

అక్కడే వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా స్థానం సంపాదించింది. గ్లామర్ హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియెంటెడ్.. ఛాలెంజింగ్ పాత్రలు పోషిస్తూ ప్రశంసలు అందుకుంది.

ఇక 1990 జూలై 27న న్యూఢిల్లీలో జన్మించింది కృతి. నోయిడాలోని జేపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసింది.

ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో అప్స్ అండ్ డౌన్స్‌ చూస్తూ..ఫిల్మ్ స్టార్ అయిపోయింది.

ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో అప్స్ అండ్ డౌన్స్‌ చూస్తూ..ఫిల్మ్ స్టార్ అయిపోయింది.

కేవలం సినిమాలు మాత్రమే కాకుండా దేశంలోని కొన్ని అతిపెద్ద బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్. సంవత్సరానికి 8 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తుంది.

ప్రతి సినిమాకు 5 నుంచి 6 కోట్లు వరకు వసూలు చేస్తుంది. ఇటీవల ఆదిపురుష్ సినిమాకు ఈమె 3 కోట్లు తీసుకుందని టాక్. అలాగే షెహజాదా సినిమాకు 5 కోట్లు తీసుకుందట కృతి.