TV9 Telugu

అందమైన ఈ అమ్మడి కోసం చిన్న వరల్డ్ వార్ జరిగినా తప్పులేదేమో..

15 Febraury 2024

27 జూలై 1990న దేశ రాజధాని ఢిల్లీలో ఓ పంజాబ్ హిందూ కుటుంబంలో పుట్టి పెరిగింది వయ్యారి భామ కృతి సనాన్.

ఈ బ్యూటీ తండ్రి రాహుల్ సనన్ చార్టర్డ్ అకౌంటెంట్, తల్లి గీతా సనన్ ఢిల్లీ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్.

ఈమెకు నూపుర్ సనాన్ అనే ఓ చెల్లెలు కూడా ఉంది. ఈమె కూడా ఓ హీరోయిన్. ప్రస్తుతం తెలుగులో కన్నప్ప సినిమా చేస్తుంది.

దేశ రాజధాని ఢిల్లీలోని R. K. పురంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించింది ఈ అందాల భామ.

నోయిడాలోని జేపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ పట్టా పొందింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో 54 మిలియన్ల మంది ఫాలోయర్స్ తో సోషల్ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

2021లో ఆమె డిజైనర్ మనీష్ మల్హోత్రా బ్రైడల్ కలెక్షన్ "నూరానియత్" బ్రాండ్ కోసం మోడల్ గా చేసింది ఈ అందాల తార.

కోకా-కోలా, టైటాన్స్ రాగా, పారాచూట్, టిస్సాట్‌తో సహా ఇటీవల అప్పి ఫిజ్ వంటి బ్రాండ్ల ప్రకటనలలో నటించింది.