హంస అమ్మాయిలా మారితే ఈ బ్యూటీలనే ఉంటుందేమో..
TV9 Telugu
11 April 2024
27 జూలై 1990 సంవత్సరంలో దేశ ఢిల్లీ నగరంలో ఓ పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ కృతి సనాన్.
ఈ బ్యూటీ తండ్రి రాహుల్ సనన్ చార్టర్డ్ అకౌంటెంట్, తల్లి గీతా సనన్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర ప్రొఫెసర్.
ఈ ముద్దుగుమ్మకి నుపుర్ సనాన్ అనే ఓ చెల్లెలు కూడా ఉంది. ఈమె కూడా టాలీవుడ్ సినిమాల్లో కథానాయకిగా నటిస్తుంది.
న్యూ ఢిల్లీ నగరంలోని R. K. పురంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించింది ఈ అందాల తార.
నోయిడాలోని జేపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బీటెక్ డిగ్రీ చేసింది.
నటి కావడానికి ముందు ఆమె కొంతకాలం మోడల్‌గా పనిచేసింది. ఆ సమయంలో కొన్ని వాణిజ్య ప్రకటనల్లో నటించింది ఈ భామ.
2014లో మహేష్ బాబుకి జోడిగా తెలుగు సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ 1: నేనొక్కడినేతో కథానాయకిగా సినీ రంగ ప్రవేశం చేసింది.
తర్వాత 2015లో దోచయ్ లో కనిపించింది. ఇటీవల మరోసారి ఆదిపురుష్ చిత్రంలో సీత పాత్రలో తెలుగులో నటించింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి