అందానికే సెగలు పుట్టించేంత అందం ఈ వయ్యారి సొంతం..

TV9 Telugu

21 January 2024

27 జూలై 1990న భారతదేశ రాజధాని ఢిల్లీలో ఓ పంజాబీ హిందూ కుటుంబంలో పుట్టి పెరిగింది అందాల భామ కృతి సనన్.

ఈమె తండ్రి రాహుల్ సనన్ చార్టర్డ్ అకౌంటెంట్, తల్లి గీతా సనన్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర ప్రొఫెసర్.

ఈ వయ్యారి ఒక చెల్లెలు కూడా ఉంది. ఈమె పేరు నుపుర్ సనన్. ఈమె కూడా తెలుగు, హిందీ సినిమాల్లో కథానాయకిగా నటిస్తుంది.

ఢిల్లీలోని R. K. పురంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది ఈ వయ్యారి భామ.

నోయిడాలోని జేపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీని పొందింది.

2014లో మహేష్ బాబుకి జోడిగా తెలుగు సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ 1: నేనొక్కడినే చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది.

2015లో నాగ చైతన్య దోచయ్ చిత్రంలో హీరోయిన్ గా చేసింది. తర్వాత హిందీ చిత్రాల్లో స్టార్ హీరోయిన్ గా బిజీ అయ్యింది.

2023లో ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాముడుగా నటించిన ఆదిపురుష్ చిత్రంలో సీతమ్మ పాత్రలో కనిపించింది ఈ బ్యూటీ.