12 May 2024

ఆ సినిమా ప్లాప్ అయినా తనకు చాలా స్పెషల్ అంటున్న హీరోయిన్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ఇటీవలే ది క్రూ సినిమాతో సక్సెస్ అందుకుంది హీరోయిన్ కృతి సనన్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.

 ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న కృతి.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు బయటపెట్టింది. 

తన కెరీర్‍లో ప్లాప్ అయిన రాబ్తా సినిమా తనకు చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆ మూవీ గురించి ఎంతో గొప్పగా చెప్పింది. 

హిందీలో తనకు రాబ్తా సినిమా మూడవ చిత్రమని.. కానీ ఆ మూవీ అంచనాలు అందుకోలేదని.. ప్లాప్ అయిందని అనుకోనని చెప్పుకొచ్చింది. 

అందులో తన పాత్ర కోసం ఎన్నో కసరత్తులు చేశానని.. అలాగే గుర్రపు స్వారీ నేర్చుకున్నానని ఆ సినిమా కోసం ఎంతో కష్టపడ్డానని తెలిపింది. 

రాబ్తా సినిమాలోని నీటిలో సన్నివేశాల కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నానని.. ఆ రెండింటిలో అనుభవం రావడానికి కారణం రాబ్తా. 

ఈ సినిమా చేయకపోతే ఆ రెండింటి గురించి ఎప్పటికీ నేర్చుకునే దాన్ని కాదని తెలిపింది. కెరీర్ ప్రారంభంలో కష్టమైన పాత్రలు చేయాలంది. 

నటిగా ఎదిగే క్రమంలో ఇలాంటి అవకాశాలు రావడం అదృష్టంగానే భావించాలని... అందుకే ఆ సినిమాకు మనసులో ప్రత్యేక స్థానం ఉందంటుంది.