07 October 2025
టాలీవుడ్ కోసం చూస్తే బాలీవుడ్ వచ్చింది. బేబమ్మకు క్రేజీ ఛాన్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
బేబమ్మ.. అలియాస్ కృతిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
తెలుగులో తక్కువ సినిమాల్లో నటించి స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీకి ఆ తర్వాత ఆఫర్స్ తగ్గిపోయాయి. ఒకటి రెండు చిత్రాల్లో మెరిసింది.
కొన్నాళ్లుగా తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తూ అక్కడే బిజీగా ఉంటున్న ఈ బ్యూటీకి ఇప్పుడు బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్న బేబమ్మకు హిందీలో ఛాన్స్ వచ్చినట్లు టాక్. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ విషయాలు తెలుసుకుందామా.
లేటేస్ట్ టాక్ ప్రకారం నటుడు గోవింద కుమారుడు యశ్వర్ధన్ అహుజా సరసన కృతి శెట్టి ఓ హిందీ సినిమాలో నటించబోతుందని టాక్ నడుస్తుంది.
ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సాజిద్ ఖాన్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం వైరల్ అవుతుంది.
దక్షిణాదిలో సూపర్ హిట్ అయిన సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారని తెలుస్తోంది. కృతి శెట్టి ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో నటిస్తుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది కృతి శెట్టి. తాజాగా చీరకట్టులో గ్లామర్ అందాలతో రచ్చ చేస్తుంది ఈ వయ్యారి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్