18 November 2025
22 ఏళ్ల హీరోయిన్.. ఒక్క సినిమాతోనే క్రేజ్.. ఇప్పుడేం ఆఫర్స్ కోసం ఇలా
Rajitha Chanti
Pic credit - Instagram
తెలుగు సినిమా ప్రపంచంలో ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె నటించిన తొలి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టైంది.
దీంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. ఇప్పుడేమో టాలీవుడ్ లో సరైన ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది.
ఆమె మరెవరో కాదండి హీరోయిన్ కృతి శెట్టి. ఒకప్పుడు తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ సెన్సేషన్ అయ్యింది కృతి శెట్టి.
కానీ కొన్నాళ్లుగా ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గిపోయిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం తమిళంలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు తెలుగులో సరైన అవకాశం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంది.
మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
ప్రస్తుతం కృతి శెట్టి ఒక్కో సినిమాకు రూ.1.5 నుంచి రూ.2 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లుగా సమాచారం. అయితే దీనిపై క్లారిటీ లేదు.
కృతి శెట్టి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొన్నాళ్లుగా ఈ అమ్మడు గ్లామర్, ట్రెడిషనల్ ఫోటోస్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్