టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త అందాలకు కొదవలేదు. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఓ హీరోయిన్ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.
తెలుగులో వరుసగా మూడు హిట్లు అందుకుంది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఆఫర్స్ తగ్గిపోయాయి.
ఇన్నాళ్లు ట్రెడిషనల్ బ్యూటీగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు గ్లామర్ హద్దులు చెరిపేసింది. నిత్యం క్రేజీ ఫోటోషూట్లతో నెట్టింట అరాచకం సృష్టిస్తుంది.
ఆమె మరెవరో కాదండి. హీరోయిన్ కృతి శెట్టి. వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, హాయ్ నాన్న సినిమాలతో హిట్స్ అందుకుంది. కానీ నెమ్మదిగా ఆమె నటించిన చిత్రాలు డిజాస్టర్ కావడంతో ఆఫర్స్ తగ్గాయి.
ఇప్పుడు ఎక్కువగా తమిళంలో సినిమాలు చేస్తుంది ఈ వయ్యారి. మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోషూట్లతో నెటిజన్లను కట్టిపడేస్తుంది కృతి.
అయితే తెలుగులో మొదటి సినిమాతోనే సెన్సేషన్ అయిన ఈ అమ్మడు.. ఇప్పుడు తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళంలో బిజీ హీరోయిన్ అయ్యింది.
ఇటీవల జీని సినిమా నుంచి విడుదలైన పాటలో తన డ్యాన్స్ స్టెప్పులతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. దీంతో ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్స్ రానున్నట్లు తెలుస్తోంది.