26 January 2024
అయ్యో పాపం.. చూసుకోవాలి కదా.. కృతిశెట్టిని అంత మాట అనేసాడేంటీ..
TV9 Telugu
Pic credit - Instagram
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సెషన్ అయ్యింది హీరోయిన్ కృతిశెట్టి. ఫస్ట్ మూవీతోనే యూత్ ఫేవరేట్ హీరోయిన్గా మారిపోయింది.
ఆ తర్వాత ఈ అమ్మడికి అదృష్టం కలిసిరాలేదు. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు హిట్ అందుకున్నా.. ఆ తర్వాత ప్లాపులు వచ్చి చేరాయి.
ప్రస్తుతం ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయి. కేవలం ఒకటి రెండు సినిమాల్లో నటిస్తుంది. తాజాగా కృతికి చేదు అనుభవం ఎదురైంది.
ఇటీవల ఓ షాప్ ఓపెనింగ్‌లో పాల్గొన్నప్పుడు అభిమాని నుంచి ఎదురైన కామెంట్‌కు ఏమాత్రం ఫీల్ కాకుండా స్పోర్టివ్‌గా తీసుకుని ఆన్సర్ ఇచ్చింది కృతి.
షాప్ ఓపెనింగ్‌కు వెళ్లిన కృతి ఆ తర్వాత అభిమానులతో మాట్లాడింది. ఈ క్రమంలోనే కృతిని చూసిన ఆనందంలో ఓ అభిమానికి వెరైటీ ప్రశ్న వేశాడు.
మీ స్కంద సినిమా సూపరుంది అంటూ ఓ అభిమాని పొగడ్తలు కురిపించాడు. సూపరుందా ? అని నవ్వుతూ అందులో నేను లేను అని చెప్పింది కృతి.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండడంతో నెటిజన్స్ స్పందిస్తున్నారు. వేరే హీరోయిన్స్ ఫీలయ్యేవారని.. కృతి మాత్రం నవ్వుతూ ఆన్సర్ ఇచ్చింది.
స్కంద సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించగా రామ్ హీరోగా కనిపించారు. కృతి ఇప్పుడు లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సినిమాతో తమిళంలో చేస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి.