25 November 2025

ఆ హీరో అంటే పిచ్చి ఇష్టం.. ఆ సినిమా 100 సార్లు చూశాను.. కృతిశెట్టి

Rajitha Chanti

Pic credit - Instagram

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి చిత్రంతోనే నటిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాతో ఒక్కసారిగా ఆమె క్రేజ్ మారిపోయింది.

ఈ సినిమా తర్వాత తెలుగులో ఒకటి రెండు హిట్స్ అందుకున్న కృతిశెట్టి.. ఆ తర్వాత వరుస పరాజయాలు చవి చూసింది. దీంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. 

ప్రస్తుతం ఆమె తమిళంలో వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ అక్కడే బిజీగా ఉంటుంది. ఇప్పుడు ఆమె తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

తెలుగులో చివరగా శర్వానంద్ సరసన మనమే సినిమాలో నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి తనకు ఓ హీరో అంటే ఇష్టమని చెప్పింది. 

తమిళ్ స్టార్ హీరో కార్తి అంటే తనకు ఎంతో ఇష్టమని.. అతడికి పెద్ద అభిమానని అన్నారు. ఆయన నటించిన ఆవారా సినిమాను వందకు పైగా చూసిందట.

హైదరాబాద్ లో ది వారియర్ షూటింగ్ సమయంలో పొన్నియిన్ సెల్వన్ సెట్ తమ సెట్ పక్కనే ఉందని.. దర్శకుడు లింగుసామి కార్తిని కలిపిస్తానని అన్నారట.

 కానీ కంటిన్యూగా షూటింగ్ ఉండడం వల్ల  కలవలేకపోయానని.. నదియా మేడమ్ కార్తి సార్ తో ఫోన్ లో మాట్లాడేలా చేసిందని చెప్పుకొచ్చింది కృతి శెట్టి.

ప్రస్తుతం తెలుగులో సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న కృతి.. సోషల్ మీడియాలో రోజుకో ఫోటోషూట్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.