13 April 2024
కృతి పరిస్థితి ఇలా అయ్యిందేంటీ..? తగ్గించినా పట్టించుకోవట్లేదా..
Rajitha Chanti
Pic credit - Instagram
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి సునామీ సృష్టించింది కృతి శెట్టి. ఒక్క సినిమాతోనే సినీ పరిశ్రమలో ఈ అమ్మడు రేంజ్ మారిపోయింది.
తొలి సినిమాతోనే రూ.100 కోట్లు కలెక్షన్స్ రాబట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినా..అందులో రెండు మాత్రమే హిట్టయ్యాయి.
ఫస్ట్ మూవీకి రూ.50 లక్షలలోపే రెమ్యునరేషన్ తీసుకున్న ఈ భామ.. ఆ తర్వాత కోటి వరకు పారితోషికం తీసుకున్నట్లుగా టాక్ వినిపించింది.
కానీ ఆ తర్వాత కృతి నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.
ఇప్పుడు తెలుగులో శర్వానంద్ జోడిగా ఓ సినిమా.. మలయాళంలో టోవినో థామస్ సరసన.. తమిళంలో జయం రవి సినిమాలో నటిస్తుంది.
ఈ రెండుమూడు చిత్రాలు తప్పితే కృతి చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు. అలాగే ఇప్పటివరకు బేబమ్మ వద్దకు మరో ఆఫర్ వెళ్లినట్లు లేదని సమాచారం.
దీంతో ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా సగానికి పైగా తగ్గించేసిందట. పారితోషికం గురించి కాకుండా ఇప్పుడు ఆఫర్స్ కోసమే వెయిట్ చేస్తుందట.
అలాగే కొన్ని రోజులుగా వరుసగా ఫోటోషూట్స్ చేస్తుంది. ఇన్నాళ్లు కాదని చెప్పిన గ్లామర్ రోల్స్ చేసేందుకు రెడీ అన్నట్లుగా ఫోటోస్ షేర్ చేస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి.