03 June 2024
రామ్ చరణ్ అంటే బేబమ్మకు అంత ఇష్టమా..? కృతి శెట్టి ఏం చెప్పిందంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
ఉప్పెన సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమయ్యింది హీరోయిన్ కృతి శెట్టి. తొలి చిత్రంతోనే స్టార్ డమ్ అందుకుంది ఈ బ్యూటీ.
ఆ వెంటనే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా అయిన కృతి.. ఇప్పుడు సినిమాలు తగ్గడంతో కాస్త సైలెంట్ అయిన సంగతి తెలిసిందే
తాజాగా యంగ్ హీరో శర్వానంద్ సరసన మనమే సినిమాలో నటింది. ఈమూవీ త్వరలోనే అడియన్స్ రానుండడంతో ప్రమోషన్లలో పాల్గొంటుంది.
ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి మాట్లాడుతూ రామ్ చరణ్ అంటే తనకు చాలా ఇష్టమని విపరీతమైన అభిమానం అని తెలిపింది.
తన ఫేవరేట్ హీరో రామ్ చరణ్ అని.. తెలుగులో చాలా సినిమాలు చూసినప్పటికీ తనకు చరణ్ నటించిన రంగస్థలం కనెక్ట్ అయ్యిందని చెప్పుకొచ్చింది.
ఆ సినిమాలో చరణ్ నటన అద్భుతంగా ఉంటుందని.. అప్పటి నుంచి చరణ్‌కు చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయానంటూ కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా చరణ్ గురించి చాలా విన్నానని.. పనిలో చాలా డెడికేటెడ్‌గా ఉంటారని.. అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ మంచిగా ఉంటారని విన్నానని తెలిపింది.
రామ్ చరణ్ సినిమాలో తనకు ఛాన్స్ వస్తే కచ్చితంగా ఎగ్జైట్‌గా ఫీల్ అవుతానని.. ఆయన సినిమా కోసం ఎక్కువ హార్ట్ వర్క్ చేస్తానని చెప్పుకొచ్చింది కృతి.
ఇక్కడ క్లిక్ చేయండి.