లోకాన ఉన్న అందమంతా పోటుపడదా ఈ బ్యూటీతో జతకట్టడానికి..

TV9 Telugu

28 March 2024

21 సెప్టెంబర్ 2003న మహారాష్ట్ర రాజధాని ముంబైలో తుళువ జాతికి చెందిన కుటుంబంలో జన్మించింది అందాల తార కృతి శెట్టి.

ఈ వయ్యారి కుటుంబం కర్ణాటకలోని మంగళూరుకు చెందినది. ఆమె తండ్రి వ్యాపారవేత్త. తల్లి ఫ్యాషన్ డిజైనర్ గా చేస్తున్నారు.

ఈ ముద్దుగుమ్మ పాఠశాలలో చదువుతున్న రోజులనుంచే వాణిజ్య ప్రకటనలలో నటించడం మొదలుపెట్టింది ఈ వయ్యారి భామ.

తన 17వ ఏట ఉప్పెన అనే తెలుగు రొమాంటిక్ డ్రామా సినిమాతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ వయ్యారి.

తర్వాత నాచురల్ స్టార్ నాని సరసన హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ సినిమా సామ్ సింగరాయ్ లో నటించింది ఈ ముద్దుగుమ్మ.

తర్వాత నాగ చైతన్యకి జోడిగా సూపర్ నాచురల్ చిత్రం బంగార్రాజుతో మరో బ్లక్ బస్టర్ అందుకుంది ఈ వయ్యారి భామ.

వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.

ప్రస్తుతం శర్వానంద్ సరసన కథానాయకిగా మనమే అనే తెలుగు సినిమాలో కథానాయకిగా నటించింది అందాల భామ కృతి శెట్టి.