ఫ్లోరల్ డ్రెస్ లో ఫిదా చేస్తున్న కృతి శెట్టి

TV9 Telugu

27 June 2024

కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన మొదటి సినిమా 'ఉప్పెన'  తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 

ఉప్పెన సినిమా తరువాత హ్యాట్రిక్‌ హిట్ కొట్టడంతో కృతి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. లక్కీ లెగ్ గా ముద్రవేసుకుంది.

ఆ తరువాత రామ్ హీరోగా నటించిన ది వారియర్‌ మూవీతో ప్లాప్‌ చూసింది. ఆ తరువాత నుండి వరుస పరాజయాలతో రేస్ లో వెనుకంజలోకి వెళ్ళిపోయింది.

అయితే తొలి సినిమా ఉప్పెన కు రూ. 6 లక్షల పారితోషకం తీసుకోగా ది వారియర్ సినిమా కోసం ఏకంగా రూ. 60 లక్షల రెమ్మ్యూనరేషన్ తీసుకుందట.

ఇది ఇలా ఉంటె సోషల్‌ మీడియాలో వరుస ఫోటోషూట్స్ తో ఫోటోస్ షేర్ చేస్తూ తరచూ తన ఫ్యాన్స్‌ను పలకరిస్తూ వస్తుంది వస్తుంది ఈ ముద్దుగుమ్మ.

శర్వానంద్‌ హీరోగా నటించిన 'మనమే' సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకుంది 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి. దీనితో ఈ చిన్నదాని జోష్ పెరిగిందనే చెప్పాలి

ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో మూడు తమిళం, 1 మలయాళం, తెలుగు చిత్రాలున్నాయి. ఈ సినిమాల ఫలితాలపైనే కృతి శెట్టి కెరీర్ ఆధారపడి ఉంది.