మతిపోగొడుతున్న కృతి శెట్టి అందాలు.. పిక్స్ చూస్తే  మైండ్ బ్లాకే 

Phani.ch

23 May 2024

తోలి చిత్రంతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. దానితో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

ఇంకా అంతా అనుకున్నట్లుగానే  కృతి శెట్టి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇంకా వరుసగా సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి.

కృతి శెట్టి వరుసగా శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటించింది. వీటిలో బంగార్రాజు మాత్రమే కాస్త పర్వాలేదనిపించింది .

బంగార్రాజు సినిమా తప్ప ఈ ముద్దుగుమ్మ నటించిన మిగిలిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. దీనితో కృతి శెట్టికి క్రమంగా ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి.   

గత ఏడాది కృతి శెట్టి కేవలం ఒకే ఒక్క తెలుగు చిత్రంలో నటించింది. అది కూడా నాగ చైతన్య హీరోగా నటించిన కస్టడీ

కనీసం ఈ చిత్రం అయినా  మ్యాజిక్ చేసి తనకు బ్రేక్ ఇస్తుందని కృతి భావించింది. కానీ ఆ చిత్రం కూడా తీవ్రంగా నిరాశపరిచింది. 

ఏది ఏమైనా గ్లామర్ పరంగా ఇప్పటికీ కృతి శెట్టి యువతకి ఫేవరిట్ బ్యూటీనే అని చెప్పాలి. 2023 కృతి శెట్టికి నిరాశాజనకంగా ముగిసింది. కొత్త సంవత్సరంలో అయినా కలిసి రావాలని కోరుకుంటున్నారు అభిమానులు.