క్యాజువల్ లుక్కే.. కానీ కేక పెట్టించిన కృతి శెట్టి.. 

TV9 Telugu

26  March 2024

బుచ్చి బాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది క్యూట్ బ్యూటీ కృతిశెట్టి.

తొలి సినిమాతోనే తన అందంతో.. అమాయకత్వంతో కుర్రకారును తన వైపుకు తిప్పేసుకుంది కృతిశెట్టి.

ఉప్పెన సినిమా మంచి విజయం సాదించడమతొ కృతిశెట్టికి ఆఫర్స్ క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది ఈ అమ్మడు.

ఉప్పెన తర్వాత వచ్చిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు కూడా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. దాంతో కృతి క్రేజ్ పెరిగింది.

అయితే గ్యాప్ లేకుండా వరుసగా యంగ్ హీరోలందరికీ ఓకే చెప్పింది ఈ చిన్నది. అక్కడే పప్పులో కాలేసింది.

స్టోరీ సెలక్షన్ పై ఫోకస్ పెట్టకుండా వరుసగా సినిమాలను ఓకే చేసింది కృతి శెట్టి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది.

దాంతో బంగార్రాజు సినిమా తర్వాత వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి. చివరిగా వచ్చిన కస్టడీ సినిమా కూడా బోల్తా కొట్టింది.

దాంతో కృతి శెట్టికి ఆఫర్స్ కరువయ్యాయి. ప్రస్తుతం ఈ చిన్నదాని చేతిలో అనుకున్నానని సినిమాలు లేవు.

దాంతో సోషల్ మీడియాను నమ్ముకుంది. రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ  దర్శకనిర్మాతలు ఆకర్షించే పనిలో పడింది.

ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.