కృతి శెట్టి అందాల ఉప్పెన..

Phani.ch

31 May 2024

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగింది తరువాత వరుస విజయాలతో హ్యాట్రిక్ పూర్తి చేసింది. కాకపోతే ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా పడిపోయింది ఈ ముద్దగుమ్మ. 

ఉప్పెన మూవీ ఒక సంచలనం. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సాన మెగా హీరో వైష్ణవ్ తేజ్ ని పరిచయం చేస్తూ ఉప్పెన తెరకెక్కించాడు.

యూత్‌ఫుల్‌ ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ సినిమా సక్సెస్ లో హీరోయిన్ కృతి శెట్టి పాత్ర ఎంతగానో ఉంది.

కాలేజ్ గర్ల్ గా కృతి శెట్టి గ్లామర్ కుర్రాళ్లను కట్టి పడేసింది. అప్పట్లో యువత ఆమె మాయలో పడిపోయారు. చిన్న సినిమాగా విడుదలైన ఉప్పెన పెద్ద విజయం సాధించింది. 

 అప్పట్లో హ్యాట్రిక్ పూర్తి చేసి గోల్డెన్ లెగ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ వరుస విజయాలు నేపథ్యంలో రెమ్యూనరేషన్ పెంచేసింది.

అయినప్పటికీ మేకర్స్ ఆమెతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే బంగార్రాజు సినిమా తర్వాత ఆమెకు హిట్ లేదు.  వరుస చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి.

మలయాళ, తమిళ భాషల్లో ఒకటి రెండు ఆఫర్స్ ఉన్నాయి కానీ ఎలాగైనా తెలుగులో నిలదొక్కుకోవాలని అమ్మడు ప్లాన్. శ్రీలీల కూడా వరుస ప్లాప్స్ తో డీలా పడింది.

ఈ క్రమంలో నిర్మాతలకు కృతి శెట్టి బంపర్ ఆఫర్ ఇచ్చిందట గతంలో రూ. 2 కోట్లు డిమాండ్ చేసిన కృతి శెట్టి కోటి, కోటిన్నర ఇచ్చినా ఓకే అంటుందట.