కృతి శెట్టి దశ మారిపోయిందా..! ఇక అక్కడే సెటిల్ అవుతుందా.?

Rajeev 

24 October 2024

ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ కృతి శెట్టి. ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. 

తొలి సినిమాతోనే వందకోట్ల వసూళ్లు రాబట్టి ఈ చిన్నది సెన్సేషన్ గా మారిపోయింది. దాంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. 

ఉప్పెన సినిమా తర్వాత ఈ చిన్నది చేసిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు కూడా హిట్ అయ్యాయి. 

దాంతో లక్కీ బ్యూటీగా మారిపోయింది కృతి శెట్టి.. కానీ ఆతర్వాత ఈ భామ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి. 

వరుసగా కృతి శెట్టి నటించిన సినిమాలన్నీ ఫ్లాప్స్ అయ్యాయి. కొన్ని వచ్చిన విషయం కూడా చాలా మందికి తెలియదు.

దాంతో కృతి శెట్టికి ఆఫర్స్ మెల్లగా తగ్గుతూ వచ్చాయి. చివరిగా శర్వానంద్ తో చేసిన మనమే సినిమా కూడా అందుకోలేకపోయింది.

కాగా రీసెంట్ గా మాలయంలోకి అడుగుపెట్టింది అక్కడ మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. అలాగే తమిళంలో ఏకంగా మూడు సినిమాలు చేస్తోంది.