ఎట్టకేలకు హిట్ కొట్టిన కృతి శెట్టి .. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ 

Rajeev 

21 September 2024

 ఓవర్ నైట్‌లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో కృతి శెట్టి ఒకరు. ఉప్పెనతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. 

బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఏకంగా 100కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

మొదట్లో ఈ చిన్నది ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అవకాశాలు అందుకుంది. హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది కృతి శెట్టి. 

ఆతర్వాత వరుసగా ఫ్లాప్స్ అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది కృతిశెట్టి. కానీ అవన్నీ నిరాశపరిచాయి.

ఈ చిన్నది నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. దాంతో కృతి శెట్టి ఆఫర్స్ తగ్గాయి. తాజాగా మలయాళంలో సినిమా చేసింది.

కృతి శెట్టి మలయాళంలో 'అజైదే రందం మోషన్'(ARM)  అనే సినిమా చేసింది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. 

ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పటికే ఈ సినిమా రూ.50 కోట్లు రాబట్టింది. దాంతో ఎట్టకేలకు కృతి హిట్ అందుకుంది.