TV9 Telugu
కృతి శెట్టి ఈజ్ బ్యాక్.! ఈ అమ్మడి చేతిలో క్రేజీ ఆఫర్స్.
23 March 2024
ఓవర్ నైట్‌లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ లో కృతి శెట్టి ఒకరు. ఉప్పెన సినిమాతో కృతి మంచి క్రేజ్ తెచ్చుకుంది.
ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది కృతి. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా ఏకంగా 100కోట్లకు పైగా వసూల్ చేసింది. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది మంగళూరు బ్యూటీ.
మొదట్లో ఈ అమ్మడు వరుస అవకాశాలతో దూసుకుపోయింది. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వరుస ప్లాప్స్ తో దీల పడింది.
ఇక ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది కృతి అండ్ తమిళ్ , మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది.
తమిళ్ లో కార్తీతో సినిమా చేయడానికి కూడా రెడీ అయ్యింది. దీంతో పాటు మరో రెండు క్రేజీ ఆఫర్స్ వచ్చాయని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే తెలుగులో శర్వానంద్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి ఎంపికైందని తెలుస్తోంది.
అలాగే తమిళ్ లోనూ జయం రవి హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ గా కృతి ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి