క్రేజీ హీరోయిన్ సంచలన నిర్ణయం! చేతులారా కెరీర్ చెడగొట్టుకుంటోందా?

03  February 2025

Basha Shek

టాలీవుడ్ హీరోయిన్లకు బాలీవుడ్‌లో  హీరోయిన్  అవకాశం వచ్చిందంటే ఎవరైనా సరే కళ్లకద్దుకుని ఒప్పేసుకుంటారు.

అయితే హీరోయిన్ కాకుండా స్పెషల్ సాంగ్స్, ఇతర క్యామియో రోల్స్ ఆఫర్స్ వస్తే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే.

ఎందుకంటే  ఒక క్రేజీ హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేస్తే మళ్లీ హీరోయిన్‌గా చాన్స్‌లు రావడం కష్టమన్న సంగతి తెలిసిందే

అయితే ఉప్పెన భామ కృతి శెట్టి కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్నప్పుడే బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్ కు ఓకే చెప్పిందని తెలుస్తోంది.

ఒక యంగ్ హీరో నటిస్తోన్న హిందీ సినిమాలో కృతి శెట్టి స్టెప్పులేసేందుకు అంగీకరించిందని ప్రచారం జరుగుతోంది.

ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం కృతి శెట్టికి సంబంధించిన ఈ న్యూస్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.

ఇప్పటికే సినిమా సెలెక్షన్ల విషయంలో  కృతి శెట్టి తప్పుటడుగులు వేసిందని, వరుసగా పరాజయాలు పలకరిస్తున్నాయన్న విమర్శలున్నాయి.

ఇప్పుడు ఏకంగా స్పెషల్ సాంగ్ తో  సినిమా కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నావంటూ కృతి శెట్టి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు