కృష్ణమ్మ వచ్చేది అప్పుడే..! రుస్లాన్ ట్రైలర్.. 

TV9 Telugu

07 April 2024

కెరీర్‌లో సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న హీరో స‌త్య‌దేవ్. ఈసారి ఆయన పక్కా యాక్షన్ కథతో ‘కృష్ణ‌మ్మ‌’ సినిమాతో వస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ఖరారైంది. మే 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు మూవీ మేకర్స్.

ఈ సినిమాకు వి.వి గోపాలకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో వస్తుంది కృష్ణమ్మ సినిమా.

అతిరా రాజ్ ఈ చిత్రంలో కథానాయకిగా నటిస్తుంది. కృష్ణ కొమ్మాలపాటి దీన్ని నిర్మిస్తున్నారు. కాలభైరవ సంగీత దర్శకుడు.

తెలుగు నిర్మాత కేకే రాధామోహన్ తొలిసారి నిర్మిస్తున్న బాలీవుడ్ ఇండస్ట్రీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా రుస్లాన్.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ భర్త ఆయుష్ శర్మ ఇందులో హీరోగా నటిస్తున్నారు.

టాలీవుడ్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. కరణ్ ఎల్ బుటానీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

సుశ్రీ శ్రేయా మిశ్రా ఇందులో హీరోయిన్. ఏప్రిల్ 26న సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసారు మేకర్స్.