15 August 2024
40 ఏళ్ల వయసులో 25 ఏళ్ల అమ్మాయిలా.. త్రిష బ్యూటీ సీక్రెట్ ఇదే..
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ అందాల భామ త్రిష ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు విజయ్ దళపతి సరసన గోట్ చిత్రంలో నటిస్తుంది.
ప్రస్తుతం ఈ హీరోయిన్ వయసు 41 ఏళ్లు. కానీ 25 ఏళ్ల అమ్మాయిల కనిపిస్తూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ ఆఫర్స్ అందుకుంటుంది.
చిన్న వయసు నుంచే అందంపై దృష్టి పెట్టి ఉన్నత విద్య పూర్తికాగానే అందాల పోటీలో పాల్గొని మిస్ చెన్నై కీరీటాన్ని అందుకుంది ఈ బ్యూటీ.
అలాగే కెరీర్ ప్రారంభంలోనే పలు ప్రకటనలలో నటించింది. అలాగే తెలుగు, తమిళం సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి అలరించింది.
ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
తాజాగా త్రిష ఆరోగ్యం, సౌందర్య రహస్యానికి గల కారణాలపై నెట్టింట అనేక విషయాలు వైరలవుతున్నాయి. త్రిష బ్యూటీ సీక్రెట్ ఎంటో తెలుసా..
త్రిష అందానికి రహాస్యం డైట్, వర్కౌట్సే ప్రధాన కారణమట. ముఖ్యంగా చిన్న వయసు నుంచే నాన్ వెజ్ విషయంలో కట్టుబాట్లు పెట్టుకుందట.
ఆయిల్ ఫుడ్ కాకుండా.. కాయగూరలతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం.. ఇంట్లో చేసిన వంటకాలను తీసుకోవడమే అని చెప్పుకొచ్చింది త్రిష.
ఇక్కడ క్లిక్ చేయండి.