చిరంజీవి గురించి కోటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు
కోటా శ్రీనివాసరావు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో విలక్షణ నటుడిగా తన సత్తా చాటుకున్నారు.
ఇప్పుడు వయసు మీద పడటంతో ఆయనకు సినిమా అవకాశాలు తగ్గాయి.
మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో సినిమా హీరోల గురించి ఆయన చేసిన కామెంట్స్ పై సెటైర్లు కురిసాయి.
ఇదిలా ఉండగా.. ఓ ఇంటర్వ్యూలో కోటా శ్రీనివాసరావు ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు.
ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు. షాట్ రెడీ అవ్వడానికి టైం పడుతుంది అన్నారు.
సరే కదా అని నేను, ఎం.ఎస్.నారాయణ బయటకి వెళ్ళాము.
ఆ టైంలో మందు తాగుతున్నప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది త్వరగా రండి అని కబురు వచ్చింది.
మేము వెంటనే బయలుదేరి వెళ్ళాం. షూటింగ్ స్పాట్లో చిరంజీవి ఉన్నారు. మేము మందు తగిన విషయాన్ని కనిపెట్టేసాడు చిరు
ఆ తర్వాత తన స్టైల్లో తిట్టిపోశాడు. ఇండస్ట్రీలో మీకంటూ ఓ మంచి పేరు ఉంది.
మీరు ఇలా చేస్తే జూనియర్స్ కూడా మీలా తయారవుతారు అంటూ మండిపడ్డాడు. అతను చెప్పింది మా మంచి కోసమే.
మా మంచి గురించి ఆలోచించే వారిలో చిరంజీవి కూడా ఒకరు’ అంటూ కోటా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.