కోలీవుడ్‌లో సీక్వెల్స్‌ సందడి.. ఎన్ని చిత్రాలంటే..

15 October 2023

భారీ హైప్‌ క్రియేట్ చేస్తున్న సీక్వెల్‌ ఇండియన్‌ 2. రెండున్నర దశాబ్దాల తరువాత వస్తున్న ఈ సినిమాకు షార్ట్ గ్యాప్‌లోనే త్రీక్వెల్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌.

ఇండియన్ 2 పూర్తయిన వెంటనే బ్రేక్ తీసుకోకుండా పార్ట్ 3ని సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు కమల్‌, శంకర్‌.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన హిట్ సినిమాలతో పాటు తమిళ్‌లో హిట్ అయిన ఇతర హీరోల సినిమాల సీక్వెల్స్‌లోనూ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

అసురన్‌, వడచెన్నై సినిమాల సీక్వెల్స్‌తో పాటు కార్తి హీరోగా తెరకెక్కిన యుగానికొక్కడు పార్ట్‌లోనూ ధనుష్‌ హీరోగా నటిస్తున్నారు.

సక్సెస్‌ఫుల్‌ స్టార్‌ కార్తీ కూడా సీక్వెల్స్ విషయంలో ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. మోస్ట్ అవెయిటెడ్‌ ఖైదీ సీక్వెల్‌ నెక్ట్స్ ఇయర్ సెట్స్ మీదకు వెళ్లనుంది.

స్టార్ హీరో కార్తీ రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ సర్దార్‌కు కూడా పార్ట్ 2ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌.

విశాల్‌ కూడా సీక్వెల్‌ ట్రెండ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తమిళ్‌తో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయిన డిటెక్టివ్‌ సినిమాకు సీక్వెల్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

కోలీవుడ్‌లో హైప్‌ క్రియేట్ చేస్తున్న మరో ఇంట్రస్టింగ్ సీక్వెల్‌ తనీ ఇరైవన్. జయం రవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన పార్ట్ వన్ సూపర్ హిట్ అయ్యింది.