ముంబై ఫ్లైట్ల ఎక్కుతున్న కోలీవుడ్ కెప్టెన్స్.. 

TV9 Telugu

13 March 2024

ఆ మధ్య మన డైరక్టర్ల జోరు చూసి, అందరూ ముంబై నగరంలో ఫ్లాట్లు కొనుక్కుంటారేమోనని ఇండస్ట్రీ అంతా అనుకున్నారు.

కానీ సందీప్‌ రెడ్డి వంగా లాగా.. ఒకరో, ఇద్దరో మినహా... మిగిలిన వాళ్లందరూ తిరుగు టపాలో టాలీవుడ్‌కి వచ్చేశారు.

సేమ్‌ టైమ్‌ సౌత్‌ నుంచి ముంబై ఫ్లైట్లకు టిక్కెట్లు తెగ కొంటున్నారు కోలీవుడ్‌ సినీ ఇండస్ట్రీ డైరక్టర్లు.

రీసెంట్‌గా బాలీవుడ్ బాద్షా షారుఖ్ కహాన్ హీరోగా నటించిన జవాన్‌తో డైరెక్టర్ అట్లీ సూపర్‌సక్సెస్‌ అయ్యారు.

కోలీవుడ్‌ డైరెక్టర్ విష్ణువర్ధన్‌ సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా షేర్‌షాతో బాలీవుడ్‌లో వారెవా అనిపించుకున్నారు.

అక్షయ్‌కుమార్‌తో సుధ కొంగర సినిమా చేస్తున్నారు. ఈ మూవీ సూర్యతో చేసిన ఆకాశం నీ హద్దురా సినిమాకి రీమేక్.

లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌తో సాజిద్‌ నదియడ్‌వాలా ప్రొడక్షన్‌లో మూవీ చేస్తున్నారు మురుగదాస్‌.

కిక్‌కి సీక్వెల్‌గా ఈ సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అయితే అందులో నిజం లేదని కొట్టిపారేస్తోంది టీమ్‌.