చిక్కుల్లో పడిన దర్శకుడు విఘ్నేష్ శివన్.. టైగర్‌ 3 ఓటీటీ రిలీజ్..

TV9 Telugu

08 January 2024

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార భర్త, కోలీవుడ్ నిర్మాత, దర్శకుడు అయిన విఘ్నేష్ శివన్ చిక్కుల్లో పడ్డారు.

తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీకి ఎల్ఐసీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా వెల్లడించారు విఘ్నేష్‌.

అయితే తమ సంస్థ పేరును ఇలా సినిమాకు పెడితే సంస్థ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేసింది ఎల్ఐసీ.

పేరు మార్చకపోతే లీగల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎల్ఐసీ యాజమాన్యం. దింతో టైటిల్ విషయంలో ఆలోచనలో ఉన్నారు విఘ్నేష్.

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం టైగర్‌ 3. కత్రినా కైఫ్ కథానాయక.

స్పై యూనివర్స్‌లో భాగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

ఆదిత్య చోప్రా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ యాక్షన్ థిల్లర్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది.

నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన టైగర్‌ 3ని డిసెంబర్‌లోనే డిజిటల్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా, ఆలస్యమైంది.