ఫ్యాన్స్‌కు పిలిపినిచ్చిన విజయ్.. ప్రపంచాన్ని గలిచినట్టుగా ఉందన్న కింగ్ ఖాన్..

09 December 2023

తుఫాన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమిళనాడు ప్రజలను ఆదుకునేందుకు సినీ పరిశ్రమ కొలీవూడ్ కదిలింది.

ఇప్పటికే హీరో విశాల్‌ లాంటి వారు ప్రత్యక్షంగా సేవా కార్యక్రమాలు పాల్గొంటూ ప్రజలకు సేవలందిస్తున్నారు.

తాజాగా తుఫాన్ భాదితుల కోసం సేవా కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా హీరో విజయ్ దళపతి తన అభిమానులకు పిలుపునిచ్చారు.

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయాలని ఫ్యాన్స్‌ను కోరారు విజయ్. దీంతో ఫ్యాన్స్‌ తరలివెళ్తున్నారు.

తన కూతురి సినిమా డెబ్యూ విషయంలో చాలా ఎగ్జైట్ అవుతున్నారు బాలీవుడ్ బాద్‌షా, స్టార్ హీరో షారూఖ్‌ ఖాన్.

ది ఆర్చీస్ అనే ఓ హిందీ వెబ్ సిరీస్‌తో గ్లామర్ ఫీల్డ్‌కు పరిచయం అవుతున్నారు కింగ్ ఖాన్ కుమార్తె సుహాన.

ఇటీవల ఈ షో ప్రీమియర్ కార్యక్రమానికి కూతురితో కలిసి వచ్చిన షారూఖ్‌ ఆ క్షణం ప్రపంచాన్ని గలిచినట్టుగా అనిపించింది అన్నారు.

తాజాగా డిసెంబర్ 7 (గురువారం) నుంచి ది ఆర్చీస్ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిజిటల్ లో స్ట్రీమింగ్ అవుతుంది.